ఎల్ నినో ఎఫెక్ట్ వర్షాల కోసం గిరిజనుల ఆరాటం
- భీమ్లా తండాలో ఊర దేవుళ్ళకు నీళ్లు పోసిన గిరిజనులు..
- వరుణ దేవుడు కరుణించాలని వేడుకోలు..!
నల్గొండ జిల్లా,మర్రిగూడ,:ప్రకృతి కరుణించాలని, వరుణ దేవుడు శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ కమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని భీమ్లా తండాలో గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో బొడ్డురాయికి, ఊర దేవుళ్లకు నీళ్లు పోశారు. ఎల్ నినో ప్రభావంతో కరవు ఛాయలు ప్రస్తుత కాలంలో ఎల్ నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన ఎండలు, కరవు పరిస్థితులు నెలకొనడంతో తండావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సగం ముగుస్తున్నా ఆశించిన మేర వానలు పడకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి.పంటలు పండాలని వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని, తండాలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఊర దేవుళ్లకు బిందెలతో నీళ్లు పోసి శాంతింపజేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, కరవు బారిన పడకుండా కాపాడాలని వరుణ దేవుణ్ణి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కమ్మగూడ సర్పంచ్ విజయ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఆంబోత్ కిషన్ నాయక్, వార్డు సభ్యులు రామావత్ విజయ్, రామావత్ బిక్షం, మాజీ వార్డు సభ్యులు శ్రీను, రామావత్ రమేష్, రామావత్ బిక్షం, రామావత్ సురేందర్, రామావత్ నాగరాజు, రామావత్ గణేష్, రామావత్ రెడ్డి, వడ్త్యా నవీన్, ఆంబోత్ విజయ్, రామావత్ రాజు, రామావత్ నరేష్, నరేందర్, అశోక్, సునీల్, శ్రీధర్, రాంచరణ్, మహేష్, కిట్టు, సోను, వంశీ తదితరులతో పాటు తండా ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 94
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
