వట్టెం గ్రామసర్పంచ్ భర్త పిట్టల శంకర్ ఆగడాలు

పేదలకు ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన ప్లాట్‌ను అమ్మించారని గ్రామస్తుల ఆగ్రహం

నాగర్ కర్నూల్ , బిజినపల్లి : వట్టెం గ్రామ సర్పంచ్ పిట్టల జ్యోతి భర్త పిట్టల శంకర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేద కుటుంబాలకు చెందిన ప్రభుత్వ ప్లాట్లను ఇతరులకు అమ్మించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారూ.ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ ప్లాట్లలో ఒకటి జలంధర్, గోవిందమ్మ పేరున ఉంది. ఆ ప్లాట్‌ను మెండే గోపాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వడ్ల శేఖరాచారి, వడ్ల అంజయ్య, మిడ్జిల్ శేఖరాచారి, సర్పంచ్ భర్త పిట్టల శంకర్ మధ్యవర్తులుగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.పేదవాళ్లకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ప్లాట్లు డబ్బున్న వారికి చేరవేయడంలో సర్పంచ్ భర్త అయిన పిట్టల శంకర్‌కు అధికారం ఉందనే ధీమా ఉంది. అందుకే ఇదంతా జరుగుతోంది అని బాధిత కుటుంబానికి చెందిన ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారం తెలిసినప్పటి నుంచి వట్టెం గ్రామంలో చర్చ జోరుగా సాగుతోంది. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన ప్లాట్లను రక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీకి ఉండగా, సర్పంచ్ కుటుంబ సభ్యుడే అందులో భాగస్వామిగా ఉన్నారనే ఆరోపణలు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*బాధితుల వద్ద ఆధారాలు:*
1. APSHCL పాస్‌బుక్ 1983-84:* జలంధర్ % గోవిందమ్మ పేరున RPH స్కీమ్ కింద అల్లాట్మెంట్
2. పంచాయతీ రశీదు 2007:* 26-02-2007 నాటి ₹97 ఇంటిపన్ను రశీదు. పేరు: వడ్ల గోవిందమ్మ W/o జలంధరాచారి, House No: 8-88
3. పోస్ట్ ఆఫీస్ రికార్డు:* పేరు GOVINDAMMA, Father Name: JALANDHAR AACHARI, Address: VATTEM ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను తిరిగి తమకే చెందే విధంగా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.మండల రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన ప్లాట్ పేదలకే ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. 
Views: 61

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు