తల్లి పాలు అమృతంతో సమానం: డీఎంహెచ్ఓ

తల్లి పాలు అమృతంతో సమానం: డీఎంహెచ్ఓ

కుల్కచర్ల, వికారాబాద్: తల్లి పాలు అమృతంతో సమానం అని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గర్భిణిలు, బాలింతలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని డీఎంహెచ్ఓ చెప్పారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. తల్లిపాలలో అన్ని రకాలైన పోషకాలు ఉండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తెలియజేశారు. కార్యక్రమంలో కుల్కచర్ల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచి అంజిలయ్య, బీజెపీ నాయకులు మహిపాల్ , ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.