మృతిరాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన

మృతిరాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన

  • మర్కుక్ మండల మాజీ ఎంపీపి పాండు గౌడ్
  • సర్పంచ్ భవాని బాలకిషన్మ
  • ర్కుక్ మండల బీసీసెల్ అధ్యక్షులు కనకయ్య ముదిరాజ్ 

సిద్ధిపేట  మర్కుక్ : ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం సమాజ బాధ్యతని మర్కుక్ మండల మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్ అన్నారు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతిచెందిన రాజంగారి సత్తెమ్మ కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీపి పాండు గౌడ్,స్థానిక సర్పంచ్ భవాని బాలకిషన్,మర్కుక్ మండల బీసీసెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,గ్రామ పెద్దలు,దాతలు కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి బాధను పంచుకున్నారు.కుటుంబం ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలన్నారు.మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట కర్రోల్ల నర్సింలు, దుబ్బాసి బాలయ్య, శ్రీగిరిపల్లి కృష్ణ , మాజీ యూత్ ప్రెసిడెంట్ కుమ్మరోళ్ళ కర్ణాకర్, రాజంగారి దేవయ్యా , యముడాల లక్ష్మణ్ ,బిక్షపతి ,నర్సింలు ,గిద్దెల బిక్షపతి, కొండనోళ్ళ నరేష్,కొండనోళ్ళ ప్రశాంత్ లు ఉన్నారు.  

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News