సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
హత్నూర: మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్టుల ఫోరమ్ జిల్లా సలహా దారులు, సీనియర్ జర్నలిస్ట్ మీనంపల్లి కిషన్ రావు మాట్లాడుతూ పదేళ్ల అనారోగ్య కారణంగా మరణించిన కామ్రేడ్ కొప్పు నర్సింలు, గత నలభై ఏళ్ల క్రితం మారుమూల గ్రామాల్లో అణగారిన వర్గాల శ్రేయస్సుకు పాటు పడుతూ సామాజిక న్యాయమే తన ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. గ్రామాల్లో పెత్తందారులు సామాన్యుల పట్ల అనుసరించే దుర్మార్గ పోకడలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తన కలం ద్వారా పతాక శీర్షికన కథనాలు రాసిన ఘనత ఆయనదే నన్నారు.పేద ప్రజలకు సామాజిక సేవలను అందిస్తూనే పాలనా యంత్రాలతో తత్సంబందాలు నెరపిన అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా రాత్రనక పగలనక పోరాడుతూ 2001లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో జడ్పీటీసీ గా ఓడిపోయినా తెలంగాణ సాధనకై తీవ్రంగా కృషి చేశారన్నారు. జర్నలిజంలో ఆయన చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూనే, వారి కుటుంబానికి ఏళ్ల వేళలా చేదోడు వాదోడుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వనరిగారి వీరేశం, పటేల్ పటేల్ పోచ గౌడ్ జైన సత్యం, బడంపేట రామస్వామి,మహమ్మద్ కరీం, రావులకోరి వెంకటేష్, మహమ్మద్ దస్తగిరి,బల్గురి బిక్షపతి, జక్కుల శ్రీనివాస్, నాయికోటి ప్రభాకర్, కొమురగళ్ళ నాగేష్,పరమేశుల కిష్టయ్య,మహమ్మద్ జావేద్, మహమ్మద్ అబ్దుల్లా, మహిపాల్, సామాజిక నాయకులు నాగులపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


