తొలిముద్దు–బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం

పంజాబ్ గడ్డ అంగన్‌వాడీలో టిఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ

తొలిముద్దు–బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం

కొత్తగూడెం :కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్ గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం 'తొలిముద్దు' ఉప్మా–కిచిడి టిఫిన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న 'బాల భరోసా' కార్యక్రమం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజలు బాల భరోసా కార్యక్రమంలో భాగంగా అందించే టిఫిన్‌ను పరిశుభ్రంగా, నాణ్యతతో తయారు చేసి, సకాలంలో పిల్లలకు అందించాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఆయాలు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు ఉప్మా–కిచిడి వడ్డించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని అవగాహన కల్పించారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News