సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు

సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్: కాంగ్రెస్ భవన్ నందు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్లే వ్యక్తిత్వం కలవరని, అభివృద్దె తన లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహాదారులుగా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా రన్నారు. గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగు, తాగు నీటి రంగంలో ఆవిష్కరణలు చేశారాణి, అల్లి సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగు నీరు అందించారాని, విద్యా వైద్య రంగంలో మెడికల్ కాలేజకీ కృషి చేశారన్నారు. సుదర్శన్ రెడ్డి గారు మరెన్నో పుట్టినరోజు రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, కోశాధికారి భక్త వాత్సలం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా ST సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,మైనార్టీ నాయకులు జావీద్ అక్రం, రాష్ట్ర నాయకులు రామర్తి గోపి,కార్పొరేటర్లు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్