మర్కుక్ రైతు వేదికలో విత్తన మేళా
సిద్ధిపేట / మార్కుక్ :మర్కుక్ మండల రైతు వేదికలో సోమవారం నాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు,ప్రభుత్వం సూచించిన పంటల సాగు విధానాలు ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము మాట్లాడుతూ రైతులు ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని,వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ తాండ కనకయ్య గౌడ్,మర్కుక్ గ్రామ సర్పంచ్ రాణి మల్లేష్, ఇప్పలగూడెం సర్పంచ్ నాగిరెడ్డి, చేబర్తి సర్పంచ్ యాదగిరి, కాశిరెడ్డిపల్లి సర్పంచ్భా స్కర్, గంగాపూర్–యూసఫ్ ఖాన్‌పల్లి సర్పంచ్ శ్యామల ప్రవీణ్,కాశిరెడ్డిపల్లి ఉప సర్పంచ్ మహేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు పృద్వి,విష్ణు భాను శ్రీ,స్థానిక విత్తనాల డీలర్లు,మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 145
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
