అస్నా తుఫాన్ తో భారీ వర్షాలు, ఈదురు గాలుల బీభత్సం
- చెట్టుకూలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
- అక్కడ అక్కడ రాకపోకల బంద్
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ లో పలు చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది,చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కొంటా ప్రాంతంలోని జగ్గర్గుండ పరిధిలోని పూవర్తి మరియు తుమాల్‌పారా గ్రామాలలో భారీ వర్షం, ఈదురు గాలుల కారణం గా అనేక మంది గ్రామస్తుల ఇళ్ల కప్పులు దెబ్బతిన్నాయి, కొన్ని నివాసాలపై చెట్లు కూలడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తుమాల్‌పారా నివాసి అయిన అరవై ఐదు సంవత్సరాల మడకం దులారి ఇంటిపై చెట్టు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు, సమాచారం అందుకున్న వెంటనే జగ్గర్గుండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు భద్రతకు సంబంధించి తగిన సూచనలు చేశారు. గాయపడిన వృద్ధురాలను తక్షణమే పూవర్తిలోని కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల శిబిరానికి తరలించి వైద్యం అందించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రమాదం నుండి బయటపడినట్లు వైద్యులు తెలిపారు, జిల్లా కలెక్టర్ అమిత్ కుమార్ ,పోలీసు ఉన్నత అధికారులు ప్రభావిత కుటుంబాల పరిస్థితిని సమీక్షించి వారికి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు,అలాగే ఈ ఘటనపై విద్యుత్ శాఖ , ఇంజనీర్, తహశీల్దార్ మరియు రెవెన్యూ అధికారికి సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.భారీ వర్షాల కారణంగా వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా చేరడంతో అధికారులు 13 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చూస్తున్నారు, రానున్న 24 గంటల్లో భారీ వర్షం చల్లని ఈదురు గాలులతో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచన చేస్తున్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది, జాలర్లను చాపల వేటకు వెళ్ళద్దు అంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు, చత్తీస్ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అస్నా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రావతి మరియు శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, శబరి నది నీటి మట్టం క్రమంగా ప్రమాద స్థాయికి చేరుకుంటోంది, కొంటాలో మొదటి హెచ్చరిక 13.500 మీటర్లను దాటి, రెండవ హెచ్చరిక స్థాయికి చేరుకుంది, శుక్రవారం సాయంత్రం లేదా రాత్రి నాటికి మూడవ మరియు చివరి హెచ్చరిక స్థాయిని కూడా దాటే అవకాశం ఉంది,శబరి నది నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ, భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం సాధారణ స్థాయి అయిన 20 అడుగుల కంటే తక్కువ ఉంది శుక్రవారం రాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరి వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


