నేనేరుగ..నేనేరుగా .. నాకేం తెల్వద్
- బాల్కొండ లో డబుల్ బెడ్ రూముల బాగోతాలు
- జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.
- సమాచారం ఇవ్వని అధికారూలు
- ఆందోళన చెందుతున్న దరఖాస్తు దారులు
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) : తెలంగాణ ప్రభుత్వo ప్రజా పాలన, గ్రామ సభలు ఏర్పాటు చేయగ డబల్ బెడ్ రూముల కోసం నిరుపేదలు దరఖాస్తుల నమోదు చేసిన రిజిస్టర్లు కనపడ కుండా పోయిన సంఘటనలు నిజామాబాదు జిల్లా బాల్కొండ లో వెలుగులోకి వచ్చింది.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు దరఖాస్తులన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా పెట్టారు దీన్ని అదునుగా చేసుకొని కొంత మంది బ్రోకర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటింటి సర్వే కోసం వస్తున్నారని తమ దరఖాస్థులు ఆన్లైన్ లో ఎక్కించడానికి కొంత సమర్పించుకుంటే మీ దర ఖాస్తూలు ఆన్లైన్ లో చేరుస్తామని ప్రచారం చేశారు, దింతో కొందరు తెలివిపరులు డబల్ బెడ్ రూమ్ ఎలాగైనా కావాలనే ఉద్దేశంతో తమ పేర్లను లోపాయికారి " ఆమ్మ్యామ్యా యా " ఒప్పందంలో భాగంగా ఐదు నుండి 10 వేల వరకు నజరాణాలు ఇచ్చుకొని ఆన్లైన్ లో నంబర్లు ఉండేలా చూసు కున్నారని తెలుస్తుంది.తమ దరఖాస్తులు ఎక్కడా అని లబ్దిదారులు ప్రస్తుత గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ ప్రశ్నిస్తే నాకు తెలియదు పూర్వ గ్రామ కార్యదర్శి ని అడుగు అని,ఇదే విషయాన్ని మండల అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డి ప్రశ్నిస్తే, నాకు తెల్వద్ మాజీ కార్యదర్శిని అడుగు అని, అంటు తప్పించుకుంటున్నారు. ఈ విషయంలో న్యాయం చెయ్యాలని బాల్కొండ తహసీల్దార్ శ్రీనివాస్ తో సంప్రదిస్తే నాకు తెలియదు మండల అభివృద్ధి అధికారి ద్వారా నాకు ఇచ్చింది కేవలం లిస్ట్ మాత్రమే అని సమాధానం ఇస్తున్నారు. దింతో ఆందోళన చెందుతున్నరు.."తప్పులు చేసినోళ్లు సంపాదించుకొని పోయారని " నష్ట పోయింది ప్రజలే అంటున్న నిజామాబాదు జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సామాజిక సాంస్కృతిక విభాగం అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ కుమార్, నర్సింగరావు ఆరోపిస్తున్నారు. బాల్కొండ లో 2వ విడుత డబుల్ బెడ్ రూము అనర్హుల జాబిత మరియు ఆన్లైన్ నంబర్లు ఉన్న వారి (99) మంది లబ్ది దారుల పేర్లు మండల అభివృద్ధి అధికారి ద్వారా తహసిల్దార్ బాల్కొండ గారికి అంద జేశారు జాబితాలో క్రమ సంఖ్య (01) నుండి(54) ఇంటి నుంబర్ లు ఉండగా క్రమ సంఖ్య (01) నుండి (55)నుండి (99) వర్షకు ఇంటి నెంబర్లు ఎందుకు చూపలేదో ? ఇదే లాజిక్కో అర్థం కావడం లేదని ప్రదీప్ కుమార్, నర్సింగ్ రావులు ప్రశ్నిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ల పంపిణి "లక్కీ డ్రా" పేరుతో ప్రజానీకం ముందు డ్రామా ఆడి డబల్ బెడ్ రూమ్ ల ఎంపికల్లో ఉద్యోగులకు, ఆర్ధికంగా,వ్యవసాయ భూములు,ఇల్లు ఉన్న వారికే ఇచ్చు కున్నట్లు ఆరోపణలు అనేకంగా ఉన్నాయన్నారు.ఇదే విషయం గురించి పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. బాల్కొండ లో ఇల్లు లేని నిరుపేదలతో పాటు ఉమ్మడి కుటుంబాల్లో నివసించే వారందరికి ఎలాంటి వ్యవసాయ భూములు లేవని డబల్ బెడ్ రూముల ధరఖాస్తులకు " ఆన్లైన్ నుంబర్ కోసం కొందరు డబ్బులు ఇచ్చిన వారి ధరఖాస్తుల కే ఆన్లైన్ నుంబర్లు ఇచ్చారాని మాన్ పూర్ లక్ష్మి, తలారి ప్రణతి,బి. శిరీష, యం.స్వప్న, బి. విజయ,బి. వందన, తాళారి ప్రణతి, మొదటి విడుత ప్రజా పాలన లో (01-01-2024)బి.ఏల్. కే /సి 21/010,అలాగే గ్రామ సభలో(23-01-2024)దరఖాస్తులు చేసుకోగా రిజిస్టర్ లో క్రమ సంఖ్య (05) నమోదు చేసారని గత గ్రామ కార్యదర్శి విచారణ చేసి మా పేర్లు ఆన్లైన్ లో నమోదు చేయలేదని తాళారి ప్రణతి,ఏం. పావని సుధా, పా. పా.రసీదు నేం బి.ఏల్. కే /సి 18/0064 , అలాగే గ్రామ సభలో రిజిస్టర్ లో క్రమ సంఖ్య (06), పైగా హైదరాబాద్ లోని జ్యోతి రావు పూలె ముఖ్య మంత్రి కార్యా లయంలో దరఖాస్తూ నేం 01112024 111239,బి. శిరీష పా. పా. రసీదు నేం బి.ఏల్. కే /సి 18/0063, అలాగే గత గ్రామ కార్యదర్శి నమోదు సంఖ్య 2092 05/6776623,ఫోన్ మెసేజ్ కూడా ఇచ్చారని,కానీ 2వ విడుత డబల్ బెడ్ రూముల్లో కూడా మా పేర్లు లేవని వారు ఆరోపించారు. ఆన్లైన్ వ్యవ హారంలో అనర్హుల జబితాలో ఆన్లైన్ నెంబర్ లేకుండానే సీరియల్ నెంబర్ 1 నుండి 407 వరకు ఇంటి నెంబర్లు ఉన్నాయ.కానీ 408 నుండి 987 ఆన్లైన్ నుంబర్లు ఇచ్చి, ఇంటి నెంబర్లు ఎందుకు చూయించ లేదని పైగా ఆన్లైన్ నంబర్లు కేటాయించిన లబ్ధి దారులందరూ ఉన్నత సంపన్న వర్గాల చెందిన కుటుంబాల వారు కావడం విశేషం.ఇందులో కింది స్థాయి నుండి ఎం. పి .డి.ఓ స్థాయి వరకు ఎంత అవినీతి జరిగిందో అర్థం అవుతుందని జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై సబ్ కలెక్టర్ స్థాయి అధికారి నెత్రుత్వంలో విచారణ చేస్తే నిజ నిజాలు బయటికి వస్తాయని శుక్రవారం వారం రోజున జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.
ఇలా చేస్తే ఏ సమస్య రాదు
బాల్కొండ లో 2 వ విడుతా డబల్ బెదురూము ల జాబితాను రద్దు చేయాలనీ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల సునీల్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసారు. లేని పక్షంలో పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుందని అయన విజ్ఞప్తి చేస్తూ రెండో విడుతా డబల్ బెడ్ రూముల ఎంపిక బాల్కొండలోని అన్ని కులాల పెద్ద మనుషు లతో లబ్ధిదారుల ఎంపిక చేయిస్తే ఎలాంటి సమస్యలు రావని విజ్ఞప్తి చేస్తున్నాను.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


