మాధవనగర్ కాలనీలో ఘనంగా  గణేష్ నిమజ్జనోత్సవం

మాధవనగర్ కాలనీలో ఘనంగా  గణేష్ నిమజ్జనోత్సవం

రూ.3.10 లక్షలకు పలికిన లడ్డూ ప్రసాదం

పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట పట్టణంలోని మాధవనగర్ కాలనీలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరునికి కాలనీవాసులు, భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట భక్తుల ఉత్సాహం మధ్య కోలాహలంగా సాగింది. మొదటి లడ్డూ ప్రసాదాన్ని హైదరాబాద్ (మేడ్చల్) కు చెందిన గజం సాయికిరణ్ రూ. 3,09,999/- ల అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు. అలాగే అదే కాలనీలో ఏర్పాటు చేసిన రెండవ లడ్డూ ప్రసాదాన్ని కాలనీకి చెందిన సాంబయ్యగారి ప్రభాకర్ రూ. 66,666/- లకు వేలంలో సొంతం చేసుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్న గజం సాయికిరణ్, సాంబయ్యగారి ప్రభాకర్‌లను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆ బొజ్జ గణపయ్య అనుగ్రహంతో కాలనీ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాధవనగర్ కాలనీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాగం శ్రీనివాస్, కమిటీ సభ్యులు కందుకూరి రవీందర్,దాదిగారి గంగాధర్, సాంబయ్యగారి ప్రభాకర్, ఉప్పల భానుప్రకాష్, పెంటయ్య సార్, డాక్టర్ సంగమేశ్వర్ రెడ్డి, చెకిలం సంతోష్ కుమార్, పాల గంగారెడ్డి మరియు కాలనీ వాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని