మంచినీటి గోస..
- ఎప్పుడు లీకేజీలు, మరమ్మతులే..
- కలవరపెడుతున్న మంచినీటి సమస్య..
- మున్సిపాలిటీలో 4 ట్యాంకర్లు...
- లైన్మెన్లను నిలదీస్తున్న ప్రజలు..
- ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు..
సూర్యాపేట:సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో మంచినీరు సరఫర సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ లో ఉన్న పట్టణ ప్రజలకు తాగు నీటి కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడూ లీకేజీలు, మరమ్మతులే. పట్టణంలో ట్యాంకర్ లు..4 మాత్రమే ఉన్నాయి.పగిలిన పైపు లైన్ బాగు చేసిన అనంతరం రెండో రోజులలో మోటార్ రిపేర్ ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియని పరిస్థితి..సమయపాలన అంటూ లేని నీటి సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలో దాదాపు 6 రోజులగా మంచినీటీ నల్లాల నుంచి నీరు రాక పోడవంతో నీటి కోసం ప్రజలు తండ్లాడిపోతున్నారు. దీంతో పట్టణంలోని వివిధ కాలనీల వాసులు మంచినీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. పట్టణంలోని ఇండ్లలో బోర్లు, మంచినీటి బావుల వసతి లేకపోవడంతో వివిధ కాలనీల వాసులు మున్సిపల్ కార్పొరేషన్ మిషన్ భగీరథ నల్లాలపై ఆధార పడి జీవిస్తుంటారు. పట్టణంలో గతంలో మంచినీటి కోసం ఎవ్వరు కష్టాలు పడకపోవడం, నీటీ కోసం ఏదురు చూసిన సందర్భాలు అసలే లేవంటున్నారు.
చెప్పినా పట్టించుకోవడం లేదు..
పట్టణంలోని పలు ప్రాంతాలలో రోజు విడిచి రోజు వచ్చే నీరు ఏకంగా ఆరు రోజులుగా రాకపోయిన పట్టించునే వారేలేని వాపోతున్నా రు. ప్రస్తుతం పట్టణంలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలో చాల ప్రాంతాలలో మెయిన్ లైన్ మంచినీటి పైప్ లైన్ పగిలిపోడంతో మున్సిపల్ నీరంతా వృథాగా రోడ్డుపాలైన రోజులు ఉన్నాయి. పగిలిన పైపులకు మరమత్తులు చేయించే నాదుడే కరువైయ్యారంటున్నారు. మంచినీరు సక్రమంగా రావడం లేదని, పాలకులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే..
గత ప్రభుత్వ పాలనలో ప్రతి రోజు మిషన్ భగీరధ మంచినీటిని పుష్కలంగా అందించగా. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీరు దోరుకక పడరాని పాట్లు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ అసమర్థత పాలన, సరిగా లేని విధానాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ప్రజలు బహిరంగానే చెబుతున్నారు.6 రోజుల అవుతున్న మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల తో నీటిని పంపిణి చేయకపోవడంతో నీటి కోసం తంటాలు పడుతున్నారు.వర్ష కాలంలోనే ఈ విధంగా ఉంటే వేసవి కాలంలో ప్రజలు మంచినీటి కోసం ఎంత కష్టం అనుభ వించావల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పగిలిపోయిన పైపు లైన్లకు వెంటనే మరమత్తులు చేయించాలి. పట్టణ వాసులకు గతంలో లాగా మంచినీటిని అందించాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


