తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ ప్రద్ పటేల్.
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ సభ్యులు భాను, మహేష్, శేఖర్, సాయి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
