మంద సత్యానందంకు విజన్ ఆంధ్ర ఘన నివాళి
జక్కుల నరేందర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు పరామర్శ...
దహన సంస్కారాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం...
బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ...
బోనకల్లు : బోనకల్లు మండలం ఎల్.గోవిందాపురం గ్రామానికి చెందిన విజన్ ఆంధ్ర కుటుంబ సభ్యుడు మంద సత్యానందం సోమవారం రాత్రి బోనకల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన విషయం తెలుసుకున్న విజన్ ఆంధ్ర వ్యవస్థాపకులు జక్కుల నరేందర్ ఆంధ్ర–తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్‌చార్జి పర్చగాని రామకృష్ణ మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజన్ ఆంధ్ర కుటుంబం తరఫున మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దహన సంస్కారాల నిర్వహణ కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంద సత్యానందం సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో సంస్థ తరఫున అవకాశం ఉన్న మేరకు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్‌చార్జి పర్చగాని రామకృష్ణ హామీ ఇచ్చారు. విజన్ ఆంధ్ర కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Views: 123
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
