నాగర్ కర్నూల్ బస్ డిపో వద్ద బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన
నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో వద్ద ఆందోళన చేసి బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి 30 మంది విద్యార్థులు ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా బస్సు సౌకర్యాలు లేక రెండు సంవత్సరాల నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైన పై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బస్ డిపో మేనేజర్ యాదయ్య సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబు,అనంత చారి,ఆంజనేయులు,షరీఫ్,మల్లమ్మ,కృష్ణయ్య,బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
