సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి.

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి.

  • సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరం
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పర్శ హన్మాండ్లు 

గంభీరావుపేట : ఈ నెల 30 న సిరిసిల్ల బైపాస్ గ్రౌండ్ లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు ప్రజలకు పిలుపునిచ్చారు, గురువారం గంభీరావుపేట మండలం  శ్రీగాథ గ్రామం లో జూరుకంటి కరుణకు 60 వేయిలు, బందెల బాల లక్ష్మి కీ 41 వేయిలు ,వేముల రమేష్ గౌడ్ కు 20 వేయిలు ,మొత్తం లక్షా ఇరవై ఒక వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు పంపిణీ చేసారు.అనంతరం పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట ఒక వరం అని నిరుపేదలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు,అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రభుత్వ,ప్రైవేట్ చిన్న ,పెద్ద అన్ని రకాల హాస్పిటల్ లలో పది లక్షల రూపాయల తో అమలు చేస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని, అన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,ఇందిరమ్మ ఇండ్లు సన్నబియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ వంటి పథకాలను నెరవేర్చడం జరిగిందని తెలిపారు,ఈ నెల 30 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రావడం జిల్లా ప్రజల అదృష్టమని పర్శ హన్మాండ్లు అన్నారు, జిల్లాలో పెండింగ్ సమస్యలు పరిష్కారంకు నోచుకుంటాయని ఆయన పేర్కొన్నారు, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బందెల రాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్,తొండ్ల దేవేంద్ర నర్సింలు,నాయకులు పర్శ శ్రీనివాస్,తొండ్ల ప్రసాద్,వేముల రమేష్ గౌడ్,వేముల గంగా గౌడ్,ఏవన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్  అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్