భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
అందోల్ ,మెదక్: అల్లాదుర్గం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ప్రతిష్టించిన వినాయకులకు నిత్యం ఘనంగా పూజలు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు 10వ రోజు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో గల్లీ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్న వితరణ ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ హరికృష్ణ, మాజీ ఎంపిటిసి బచ్చు రమేష్ గుప్తా, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దుర్గారెడ్డి లు హాజరై అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గల్లీ బాయ్స్ అసోసియేషన్ సభ్యులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ అన్నదానం అంటే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు తెలిపారు.సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు యువత ఎప్పుడు ముందుండాలని సూచించారు.అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


