అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష 

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష 

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ లకు మంజూరైన1.25కోట్లతో తొందరగా మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అలాగే మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను నీటిపారుదల శాఖ నుంచి కార్పొరేషన్కు అప్పగించాలన్నారు. అలాగే నార్త్ మండలానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా ఈ నెల 25న ఇందూరులో నిర్వహించే గణపతి నిమజ్జన శోభాయాత్ర కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం  నగరంలో పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ ల సమస్యపై కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. వీలైనంత తొందరగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇరిగేషన్ శాఖ ఈ ఈ నరేందర్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు  భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
హైదరాబాద్: సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లలో...
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్ 
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష