చౌటకూర్‌లో ఘనంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం

చౌటకూర్‌లో ఘనంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం

విద్యార్థులు మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి: ఎంపీడీవో కే. శంకర్

చౌటకూర్, : చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటకూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కే. శంకర్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, పాఠశాల పరిసరాల్లో నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు పెద్దఎత్తున పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యావ రణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తే భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణా న్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చౌటకూర్ మండల విద్యాధికారి అనురాధ, ఏపీవో రామ్మోహన్, ఈసీ మహేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సందీప్, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, మల్లేశం, విజయలక్ష్మి, పీడీ అరుణతో పాటు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News