పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా, మార్షల్ ఆర్ట్స్ పై జాతీయ వర్క్ షాప్
విద్యార్థులకు శారీరక దృఢత్వం, ఆత్మరక్షణపై అవగాహన
జిల్లా నాగర్ కర్నూల్, బిజినేపల్లి : పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (అటానమస్) లో శారీరక విద్య, ఆర్ట్స్ విభాగాలు, ఐక్యూఏసీ మరియు పతంజలి సేవా సమితి ఆధ్వర్యంలో యోగా, మార్షల్ ఆర్ట్స్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్ మంగళవారం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాములు అధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ అవసరమని అన్నారు. పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాస్పరి శివుడు యోగా ఆసనాలు, ధ్యాన పద్ధతులను ప్రదర్శించారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు చిమ్మిరి అజయ్ ఆత్మరక్షణ మెళకువలను వివరించారు. ఈ వర్క్ షాప్ లో ఆన్ లైన్ ద్వారా 60 మంది, ప్రత్యక్షంగా 282 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డా. వి. శ్రీనివాసులు, డా. కె. సుష్మా సమన్వయం చేశారు. అధ్యాపకులు నాగలింగం, ప్రకాశ్ బాబు, డా. పద్మజ, డా. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


