దేవత్ పల్లి లో సర్వేనెంబర్ 111 లో భూములు పరిశీలించిన చండూర్ ఆర్డీవో
నాంపల్లి మండలం దేవత్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 111లో ఉన్న భూమిని చండూర్ ఆర్డీవో శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ ఆంజనేయులు సర్వేయర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. లోకాయుక్త భూమికి సంబంధించిన వివరాలు, హద్దులు, రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.సర్వే నంబర్ 111కు సంబంధించిన భూ వివరాలను అధికారులు పరిశీలించి, హద్దులను నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా సర్వేయర్లకు అవసరమైన వివరాలను సేకరించి, రికార్డులతో క్షేత్రస్థాయి పరిస్థితులను సరిపోల్చారు. భూ సంబంధిత అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


