పరివేదలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం 

పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు సలహాలు అందించడమే మా ట్రస్టు లక్ష్యం

పరివేదలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం 

హుస్నాబాద్   : గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు సన్ రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేద ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.  వైద్య శిబిరాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి  డాక్టర్లు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడము కోసమే ఈ వైద్య శిబిరం నిర్వహించామని ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధి నిపుణులు ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు జనరల్ సర్జన్ తదితరులు. పాల్గొని అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు.గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా అనేక రంగాల్లో ప్రత్యేకంగా విద్య వైద్య రంగాలలో సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అందిస్తామని గవ్వ వంశీధర్ రెడ్డి తెలిపారు.ఈ వైద్య శిబిరంలో 216 మందికి ఉచితంగా మందులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసా కొమరయ్య, ఉప సర్పంచ్ పొన్నం బాలయ్య, మాజీ సర్పంచ్ ఉప్పలయ్య,లింగం సితారీ ,మాజీ ఉపసర్పంచ్ పొన్నం అంజయ్య, గవ్వ వీరారెడ్డి, వార్డు సభ్యులు ఇరుమల మహేష్, ఖాతా బాబు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చాడ రాజిరెడ్డి, నాగెల్లి అశోక్, గవ్వ వంశీధర్ రెడ్డి యువసేన అధ్యక్షుడు మహమ్మద్ ఒవైస్, కల్లికోట రాహుల్, పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News