రేపు రూ.1.5 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రేపు రూ.1.5 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ.
  • కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు

తాండూరు / వికారాబాద్ : బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 1.5 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కు లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాండూర్ నియోజ కవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 200 మంది లబ్ధిదారులకు రూ.1.5 కోట్ల విలువైన ముఖ్య మంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రేపు సెప్టెంబర్ 2న బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  నిర్వహించే కార్యక్రమం లో చిక్కులు పంపిణీ చేయనున్నారని తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాతుల నాగరాజు కోరారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News