గణపయ్యకు ఘనంగా హోమం.. అన్నప్రసాదం పంపిణీ
బిచ్కుంద, : బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామంలో బాల సత్య చైతన్య గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి స్వామికి ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలి సభ్యులు, భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు, యువత పాల్గొని గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేందుకు మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


