జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 కార్యక్రమం
చౌటకూర్ :సుల్తాన్పూర్లోని జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ –2026కు సంబంధించి అంతర్గత హ్యాకథాన్ను సెప్టెంబర్ 24న నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు బృందంగా పనిచేసే సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాధ రాజు మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు చక్కటి వేదికగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మలచి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. కళాశాల వైస్-ప్రిన్సిపాల్ డా. వై. రాఘవేందర్ రావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన మరియు స్టార్టప్ ఆలోచనా విధానం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.కళాశాల స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అధికారి డా. ఎం. శైలజ, ప్రొఫెసర్ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 ద్వారా దేశ నిర్మాణంలో యువత పాత్రను బలోపేతం చేయడంతో పాటు, విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనా విధానం మరియు ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నాయి.ఈ కార్యక్రమానికి జడ్జిగా డా.జింక శ్రీధర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ హాజరై విద్యార్థు ల ప్రాజెక్టులు, ఆలోచనలు మరియు పరిష్కారాలను పరిశీలించి మూల్యాంకనం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు 57 బృందాలుగా ఏర్పడి అనే స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం పొందారు. బృందాలుగా ఏర్పడి సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలను రూపొందించడం, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం వంటి అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.అనే భావనకు అనుగుణంగా నిర్వహించిన ఈ అంతర్గత హ్యాకథాన్ విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే వేదికగా నిలిచింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


