వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి : బాచుపల్లి ఇందిరానగర్‌లో శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక మహోత్సవ నిమజ్జనం కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్, డాక్టర్ ఎస్.పీ. నాయక్, హర్యా నాయక్, ఎం. రాజు నాయక్, ఎం. పరమేష్ నాయక్, లోకేష్ నాయక్, వినాయక కమిటీ నిర్వాహకులు సయ్యద్ సలీమ్, సయ్యద్ షకీల్, దోసకంటి వెంకటేష్, శ్రీను, సురేష్ తదితర కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


