సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్ అనారోగ్యంతో గురువారం రోజు మృతి చెందారు. ఆయన మృతితో శివన్నగూడ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.ఈ సందర్భంగా సీపీఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు రమేష్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. "జోహార్ కామ్రేడ్ పిట్టల రమేష్ అమర్ రహే" అంటూ నినాదాలు చేసి తమ ప్రియమైన నాయకునికి కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ పిట్టల రమేష్ సీపీఎం పార్టీలో ఎన్నో ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేశారని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని, రమేష్ అకాల మరణం సీపీఎం పార్టీకి మరియు ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సిద్దగోని మహేష్, మైల సత్తయ్య, లపంగి చంద్రయ్య, ఊరుపక్క కృష్ణ, మోర యాదయ్య, పూల వెంకటయ్య తదితరులు రమేష్ పార్థివదేహానికి నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


