ప్రమాదకరంగా మారిన జాలిగామ బైపాస్ రోడ్డు

ప్రమాదకరంగా మారిన జాలిగామ బైపాస్ రోడ్డు

గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ గ్రామానికి వెళ్లే బైపాస్ రోడ్డు తీవ్ర అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలోనే పత్రికల ద్వారా రోడ్డు దుస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి స్పందనా తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, జాలిగామ గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.
Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.