వాక్-ఇన్ అడ్మిషన్లకు శ్రీకారం

  • ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 15 వరకు దరఖాస్తులు
  • 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులకు అవకాశం
  • ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్ జి. రమేశ్

కొత్తగూడెం : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, ఆర్‌ఐటీఐ, ఏటీసీ  ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి రెండో విడత  వాక్-ఇన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్ జి. రమేశ్ తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో రూ.100 ధృవీకరణ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం తమకు నచ్చిన ట్రేడ్‌లు, ఐటీఐలను ఆప్షన్ల రూపంలో ఎంపిక చేసుకోవచ్చని వివరించారు.వాక్-ఇన్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 15 వరకు జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఐటీఐలలో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రాలకు ఉదయం 10 గంటలకు హాజరై అటెండీ  పొందాలని సూచించారు. అటెండీ పొందిన అభ్యర్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సీట్ల కేటాయింపు చేపడతామని వెల్లడించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, కొన్ని ట్రేడ్లకు 8వ తరగతి ఉత్తీర్ణులు కూడా అర్హులు అని తెలిపారు. ఏ ట్రేడ్లకు 8వ తరగతి అర్హత ఉంటుందో సంబంధిత వివరాలు వెబ్‌సైట్‌లోని ట్రేడ్ సిలబస్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2022 ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఐటీఐ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని, గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకే ఆన్‌లైన్ దరఖాస్తుతో రాష్ట్రంలోని ఎన్ని ఐటీఐలకైనా, ఎన్ని ట్రేడ్లకైనా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వవచ్చని, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సీట్ల కేటాయింపు పూర్తిగా మెరిట్, అభ్యర్థి ఎంపిక చేసిన ట్రేడ్, ఐటీఐ ప్రాధాన్యత ఆధారంగా ఉంటుందని తెలిపారు.ప్రవేశ ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్  జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు