జన హృదయ నేత తూముల భుజంగరావు త్వరగా కోలుకోవాలి
- పెన్‌పహాడ్‌లో వెల్లువెత్తిన అభిమాన సముద్రం..
- కన్నీటి ప్రార్థనలతో పొర్లుదండాలు!
- సర్పంచ్ ఒగ్గు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పెన్ పహాడ్,( సూర్యాపేట) రాజకీయాలకు అతీతంగా ప్రతి గుండెలో స్థానం సంపాదించుకున్న నిరుపేదల ఆపద్బాంధవుడు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పెన్‌పహాడ్ మండలంలో అభిమానం వెల్లువలా ఎగసిపడింది. బుధవారం నాడు ఆయన స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చేరినట్లు తెలిసిన క్షణం నుండి, మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భుజంగరావు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు.. కష్టమొస్తే కాపాడే ఒక పెద్ద దిక్కు అని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని మండల వ్యాప్తంగా దేవాలయాలు ప్రార్థనలతో మారుమోగుతున్నాయి. ఈ క్రమంలో పెన్‌పహాడ్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఒగ్గు రవి ఆధ్వర్యంలో స్థానిక బొడ్రాయి అమ్మవారి వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. "మా సార్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఇల్లు చేరాలి" అంటూ అభిమానులు అమ్మవారిని వేడుకున్నారు.
నాయకుడిపై అచంచల విశ్వాసం.. ధర్మపురంలో పొర్లుదండాలు:
భుజంగరావు పై ఉన్న అపారమైన భక్తి, ప్రేమాభిమానాలకు నిదర్శనంగా ధర్మపురం గ్రామంలో ఆయన పరమ అభిమాని లెనిన్ గ్రామ దేవత ఆలయం చుట్టూ పొర్లుదండాలు పెట్టి మొక్కులు తీర్చుకోవడం అందరినీ కదిలించింది. జన హృదయ నేతపై ప్రజల్లో ఉన్న నిఖార్సయిన ప్రేమాభిమానాలకు ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. భుజంగరావు నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్న ఈ ఆరాధన చూస్తుంటే ఆయన సంపాదించుకున్న ప్రజా బలమేంటో అర్థమవుతుందని స్థానిక పెద్దలు కొనియాడారు. ఈ మహా ప్రార్థనా కార్యక్రమాల్లో వార్డు మెంబర్లు, ముఖ్య నేతలు ఒగ్గు వీరయ్య, విక్రమ్, రాంబాబు, బంటు నారాయణ, చమకూరి హుస్సేన్, సైదులు, ఒగ్గు జానయ్య, పిడమర్తి వెంకన్న, వినోద్ మరియు వందలాది మంది శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
