​కోమటిపల్లి అడవిలో కూలిన వృక్షాలు

పరిశీలించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు

​కోమటిపల్లి అడవిలో కూలిన వృక్షాలు

​మంగపేట,  :ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ మహావృక్షాలు నేలకూలిన సంఘటన కలకలం రేపింది. దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బుధవారం నేరుగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అటవీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, చెట్లు ఏ రీతిలో దెబ్బతిన్నాయనే విషయాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గతంలో మేడారం అడవుల్లో సంభవించిన ఘటన తరహాలోనే, ఇక్కడ కూడా బలమైన ఈదురుగాలులు లేదా సుడిగాలి ధాటికి ఈ భారీ నష్టం వాటిల్లినట్లు స్థానికులు, అధికారులు ఆయనకు వివరించారు.అనంతరం లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ — ప్రకృతి వైపరీత్యాల వల్ల అడవులు దెబ్బతినడం తీవ్ర ఆందోళనకరమని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నేలకూలిన చెట్లను తొలగించి, ఆ ప్రాంతంలో ప్రత్యేక అటవీ పునరుద్ధరణ  చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పార్టీ నాయకులు తాటి కృష్ణ, కాకులమర్రి ప్రదీప్ రావు, తుమ్మ మల్లారెడ్డి, బాడిషా నాగ రమేష్, కూనూరు అశోక్ గౌడ్, చిట్టి మల్ల సమ్మయ్య, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ఎస్.కె. కుర్బాన్ అలీ, యలవర్తి శ్రీనివాసరావు, తాడూరి రఘు, కర్ర రవీందర్, ఎండి. అయూబ్, జాడి భోజారావు, సంకోజు ప్రశాంత్, మూగల రమేష్, రావుల రమణ సంతోష్, గండపల్లి నర్సయ్య, మునగాల నరేష్, మునిగల సాంబులు, పుల్ల సోయం ఈశ్వరయ్య, వంశీ, మునగాల మహేష్, జాడి కృష్ణలతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
హన్మకొండ  : ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.బుధవారం గ్రేటర్ వరంగల్...
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం
జలసిరిలో భాగంగా ఫారం పాండ్‌ నిర్మాణం.. రైతు అంజయ్యకు అభినందనలు
చౌటకూర్‌లో పాఠశాలల నిధుల వినియోగంపై ఆడిట్
భారత్ మాతానినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్  
సగర్వంగా హర్ ఘర్ తిరంగా: మల్యాలలో ఘనంగా పాదయాత్ర, కొండగట్టు వరకు బైక్ ర్యాలీ