జోరు వానలోనూ ఆగని బీఆర్‌ఎస్ శ్రేణుల ఊరట
బాధిత కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం
మంగపేట, : ఈదురు గాలులు, జోరు వానను సైతం లెక్కచేయకుండా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు మంగపేట మండలం పురేడుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తాటి చిన్ని (తాటి వరదయ్య తండ్రి) కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించారు.
విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తాటి కృష్ణ, జిల్లా యూత్ నాయకులు బాడిశ నాగ రమేష్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. అనంతరం పార్టీ తరఫున కుటుంబానికి రూ. 10,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పురేడుపల్లి మాజీ గ్రామ అధ్యక్షుడు కొప్పుల మాణిక్యం, కుర్బన్ అలీ, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, చిట్టీమల్ల సమ్మయ్య, యలవర్తి శ్రీనివాస్, కడబోయిన నరేందర్, ముకుందం, సోయం ఈశ్వర్, సాంబులు, గౌని రమేష్, ఉడుగుల శ్రీను, మహేష్, సుంకోజ్ ప్రశాంత్, రమణ, జగన్, వెంకటేశ్వర్లు, మహేష్, వంశీ, సంతోష్, మహేష్, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
