భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు. అవసరం అయితే తప్ప బయటకి రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్థంభాలకి, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు మీద అత్యంత వేగంగా ప్రయాణించరాదని, రోడ్డు మీద నిలువ ఉన్న నీటి యొక్క లోతును గమనించి ప్రయాణం చేయాలని, అజాగ్రత్తగా నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. చేపలు పట్టుటకు, పశువులను మేపడానికి బయటకి వెళ్ళరాదని, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం సమయంలో చెట్ల కింద ఉండడం వల్ల పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అందువల్ల చెట్ల కింద ఉండరాదని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంటు మోటర్లతో జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని, అత్యవసర సమయంలో సహాయం కొరకు డైల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


