గురు పౌర్ణమి వేళ  కుడుగుంట దేవాలయం లో సాయిబాబాను దర్శించుకున్న తక్కలి శివ

గురు పౌర్ణమి వేళ  కుడుగుంట దేవాలయం లో సాయిబాబాను దర్శించుకున్న తక్కలి శివ

మర్పల్లి(వికారాబాద్ జిల్లా ) మండలంలోని కుడుగుంట గ్రామంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తక్కలి శివ వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సాయిబాబా ఆశీస్సులు పొందిన భక్తుల్లో కృష్ణ, గణేష్, శేఖర్, రమేష్, యాదవ్ రెడ్డి, శోభన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేశారు
Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత