ఘనంగా ప్రారంభమైన 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమం

చిన్నారులకు తొలిముద్ద వడ్డించి ప్రారంభించిన కార్పొరేటర్ మునిగడప పద్మ

ఘనంగా ప్రారంభమైన 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమం

కొత్తగూడెం, : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. డివిజన్‌లోని 15, 18, 19 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్ద వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడటమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గోధుమ రవ్వతో పాటు వివిధ రకాల పప్పులు, పల్లీలు వంటి ప్రోటీన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించడం ద్వారా చిన్నారులకు అవసరమైన పోషకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. చిన్నారులకు అందించే పౌష్టికాహారం నాణ్యమైనదిగా ఉండేలా కాంట్రాక్టర్లు ముడి పదార్థాలను సరఫరా చేయాలని, వాటి నాణ్యతను అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఎన్. సరోజ, డి. నీలవేణి, షహనాజ్ బేగం, ఆయమ్మ వెంకటలక్ష్మి, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Views: 80

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News