ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సబితా గోవర్ధన్ రెడ్డి

గ్రామాభివృద్ధికి గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ సత్కారం

ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సబితా గోవర్ధన్ రెడ్డి

షాబాద్, (రంగారెడ్డి): గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, మల్లారెడ్డిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ అమీర్పేట సబితా గోవర్ధన్ రెడ్డికి బహుజన సాహిత్య అకాడమీ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది.రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సబితా గోవర్ధన్ రెడ్డి ఈ అవార్డును నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం అందుకున్నారు.గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన విశిష్ట సేవలను గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రదానం చేసింది.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ భూపాల్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ పాల్గొని సబితా గోవర్ధన్ రెడ్డిని అభినందించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మలి రమేష్,మల్లారెడ్డిగూడ గ్రామ ఉపసర్పంచ్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News