నడికూడ రైతు వేదికలో విత్తనమేళా
హన్మకొండ : నడికూడా రైతు వేదికలో రైతులకు నాణ్యమైన కంది విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు విత్తనమేళా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ...ప్రస్తుత వాతావరణ పరిస్థితులను మరియు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు వేసుకోవాలని అందులో కంది పంట చాలా అనుకూలమని తెలిపారు.ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు మరియు వాతావరణంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న పంటల కంటే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నడికూడ మండల వ్యవసాయ అధికారి సూచించారు. ముఖ్యంగా కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు వంటి ఆరుతడి పంటలు తక్కువ నీటితో మంచి దిగుబడిని అందించే అవకాశముందని తెలిపారు. వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల విస్తీర్ణాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సరైన విత్తే దూరం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నివారణ వంటి శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ విత్తనమేళా మరో రెండు రోజులు ఉంటుంది కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన కంది విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని, అలాగే కూరగాయల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ తెలిపారు. అదేవిధంగా నడికూడ రైతు వేదికలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫార్మ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, వర్షపు నీటిని ఫార్మ్ పాండ్స్‌లో నిల్వ చేసుకోవడం ద్వారా పంటలకు అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు.ఫార్మ్ పాండ్స్ ద్వారా భూగర్భ జలాల పెరుగుదల, నీటి సంరక్షణ, సాగునీటి అందుబాటు మెరుగుపడి రైతులకు స్థిరమైన దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాధ్యమైనంత మేరకు ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రశాంత్, గోపినాథ్, భాస్కర్, రామకృష్ణ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
Views: 113
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
