జేఎన్‌టీయూహెచ్ లో ఘనంగా ఓరియంటేషన్ వేడుకలు

జేఎన్‌టీయూహెచ్ లో ఘనంగా ఓరియంటేషన్ వేడుకలు

చౌటకూర్:సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్‌పూర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధికారులు విద్యార్థులకు విద్యా విధానం, కళాశాల నియమ నిబంధనలు, అకాడమిక్ కార్యకలాపాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, హాస్టల్ సౌకర్యాలు, ప్లేస్‌మెంట్ అవకాశాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఎన్., ఐఏఎస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి తోడ్పడే ఇంజినీర్లుగా ఎదగాలని సూచించారు.సంగారెడ్డి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ సాంకేతిక విద్యతో పాటు నైతిక విలువలు, సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.జేఎన్‌టీయూహెచ్ రెక్టర్ డా. ఆర్. దామోదరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యా, పరిశోధన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జేఎన్‌టీయూహెచ్ యూసీపీఎస్ ప్రిన్సిపాల్ డా. ఎం. సునీతా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్ ప్రతిభతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్ ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, క్రమశిక్షణ, పరిశోధన, ప్లేస్‌మెంట్ అవకాశాలు, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి కళాశాలకూ, తల్లిదండ్రులకూ మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.వై. రాఘవేందర్రా వు, వివిధ విభాగాలా ధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు