రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే తొలగించాలి
– ప్రజావాణిలో అధికారులకు స్థానికుల వినతిపత్రం సమర్పణ
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డుకు ఆనుకుని అత్యంత ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే అక్కడ నుంచి తొలగించి, వేరే ప్రాంతానికి మార్చాలని కోరుతూ స్థానిక ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... చౌటకూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే ఈ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు, బాటసారులు నిత్యం భయపడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన చౌటకూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించాలని కోరారు.ప్రజా సంక్షేమం, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రహదారిపై రాకపోకలకు ఆటంకంగా మారిన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే తొలగించి, అనుకూలమైన వేరొక సురక్షిత ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రంపై అధికారులు సానుకూలంగా స్పందించి, ప్రజల సమస్యను పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని చౌటకూర్ గ్రామ ప్రజలు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి, రామ గౌడ్, వార్డు సభ్యులు చక్రపాణి, గోరేమియా, కుమార్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
