నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

  •  ఆసుపత్రుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  • మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
 

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్ లోని మంత్రి రాజనర్సింహ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంజీఎం, స్టేషన్ ఘన్‌పూర్ లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని 31డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే నిర్వహణకు అవసరమైన వైద్య, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల, చిల్పూర్ మండల కేంద్రం, రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సేవలను వెంటనే అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, కెఆర్ నాగరాజు, వైద్యరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, వైద్యరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.