పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
- తాండూరు ఎమ్మెల్యే బుయాని మనోహర్ రెడ్డి.
- ఇందిరమ్మ గృహప్రవేశంలో.. పాల్గొన్న ఎమ్మెల్యే.
తాండూరు (వికారాబాద్ జిల్లా) పేదల సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయాని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం నూతనంగా నిర్మించిన సగ్గెం ఇందిర నారాయణ ఇందిరమ్మ ఇళ్లు మరియు 27వ వార్డులో నూతనంగా నిర్మించిన రజియా బేగం దస్తగిర్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సొంతింటి కళను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికు ఎమ్మెల్యే బీఎంఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


