వర్గల్ క్షేత్రంలో ముగిసిన వరుణ యాగం

వర్గల్ క్షేత్రంలో ముగిసిన వరుణ యాగం

  • - శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి జలాభిషేకం చేసిన సిద్ధాంతి చంద్రశేఖర శర్మ
  • - పది రోజులపాటు క్షేత్రంలో వైభవంగా మహా రుద్రాభిషేకం
  • - లోక కళ్యాణార్థమే ఈ మహత్కార్యం _ ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి
 

గజ్వేల్/సిద్దిపేట  : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతి కరుణించాలని కాంక్షిస్తూ ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వరుణ యాగం వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థమై నిర్వహించిన ఈ మహా రుద్రాభిషేకంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, గురువులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా పది రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ మహత్కార్యం సత్ఫలితాలు ఇవ్వాలని కాంక్షిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి సోమవారం జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడాలని కాంక్షిస్తూ యజ్ఞ యాగాదులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ముఖ్యంగా వేద పండితులు నిర్వహించే విశేష వైదిక క్రతువు వరుణ యాగంతో ప్రకృతి కనికరిస్తుందని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని స్పష్టం చేశారు. మూల మంత్ర హోమము, ప్రత్యేక కలశ పూజలు, మహా రుద్రాభిషేకం తదితర నిర్వహించగా, శ్రీ పరమేశ్వరుడి కృప కోసం ప్రతినిత్యం ఆలయ సముదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. అయితే రైతులు సుభిక్షంగా పంటలు పండించాలని తమ లక్ష్యం కాగా, ఆ దిశగా క్షేత్రంలో ఈ పుణ్యకార్యం నిర్వహించినట్లు సిద్ధాంతి చంద్రశేఖర శర్మ వివరించారు.
Views: 131

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.