వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకున్న వరంగల్ KUC పోలీసులు.

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన  నిందితులను పట్టుకున్న వరంగల్ KUC పోలీసులు.

మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించారు
1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20)దుర్గం సాయి కార్తీక్ (21),  వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. 
స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో గ్లామర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్, హోండా హార్నెట్ తదితర మోడళ్లకు చెందిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.28 మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసినారు. వీటికి సంబంధించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. 
 
పై వరుస వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CCS ఇన్‌స్పెక్టర్లు A. రాఘవేందర్, E. హరికృష్ణ, K. రామకృష్ణ గార్లను, KUC ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ గారిని, CCS SI శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ అహ్మీద్, రవిప్రసాద్, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్‌లను, IT Core Team AO Md. సల్మాన్ పాషా మరియు కానిస్టేబుల్ నగేష్, KUC క్రైమ్ కానిస్టేబుళ్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ మీడియా సమావేశంలో హనుమకొండ, CCS ఏసీపీలు నర్సింహారావు, సదయ్య పాల్గొన్నారు.
Views: 0

About The Author

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.