అక్రమ కేసులకు భయపడేది లేదు’  డాక్టర్ రాజా రమేష్

అక్రమ కేసులకు భయపడేది లేదు’  డాక్టర్ రాజా రమేష్

మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం స్థానిక సూపర్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా రమేష్ మాట్లాడారు. చైర్ పర్సన్,కౌన్సిలర్లకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై త్వరలోనే మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంభగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,గడ్డం రాజు,బొమ్మ భూమయ్య గౌడ్, ఆర్నె సతీష్,కొండ కుమార్,సతీష్,చంద్ర కిరణ్,లక్ష్మీ కాంత్,మహేష్,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.