రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 

రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 

బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం.

ఆదిలాబాద్ : రిమ్స్ లో ప్రమాద ఘటన నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గురువారం రిమ్స్ ను సందర్శించారు.డిసిసి అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్,ఇతర నాయకులతో కలిసి  ఎస్ఎన్ సీయు వార్డును పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.అగ్ని ప్రమాదంలో పసిపిల్లల ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా బాధాకరమని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందడం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం,అర్హులకు 100% ఇందిరమ్మ ఇంళ్లు అందిస్తామని తెలిపారు. మిగతా చిన్నారులను ఇతర ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని సంఘటనపై ప్రత్యేక కమిటీతో పూర్తిస్థాయి పూర్తిస్థాయి విచారణ చేపట్టామని పేర్కొన్నారు.ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు సమాచారాన్ని ,అసత్య ప్రచారాలను వ్యాపింప చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు మండిపడ్డారు.మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, టిఆర్ఎస్,చీప్ కవిత వ్యాఖ్యలను ఖండించారు.ఐదుగురు చనిపోతే ఆరుగురని ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీ కూడా నియమించా మన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్,బోత్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి,జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అంబకంటి అశోక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News