63 కిలోల గంజాయిని బూడిద చేసిన పోలీసులు
38 కేసులకు సంబంధించిన మాదకద్రవ్యాలను ధ్వంసం
కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మాన కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ కర్మాగారంలో పోలీస్ కమిషనర్ సమక్షంలో మాదకద్రవ్యాల పరిష్కార కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని అగ్నికి ఆహుతి చేశారున్యాయస్థానం అనుమతితోనే ఈ ప్రక్రియను చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో సహాయ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ జి,వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రఫీక్, శ్రీలత రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి తో పాటు కర్మాగారానికి చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
