దత్తాత్రేయ స్వామి కరుణా కటాక్షాల తో సర్వం సుభిక్షంగా ఉండాలి.
- తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విట్టల్ నాయక్.
- అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.
తాండూరు (వికారాబాద్ జిల్లా) దత్తాత్రేయుని కరుణా కటాక్షాలతో సర్వంసుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ అన్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రం ఘాన్ గాపూర్ లోని త్రివేణి సంగమంలో నది స్నానం ఆచరించి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రో చ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేస్తూ ఘనంగా సన్మానించారు.అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు వర్య్త విఠల్ నాయక్ అన్నసమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమిరోజు చేసిన పూజలు, దానధర్మాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయన్నారు. అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని వెల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు రాజు, భక్తులు, తదితరులు ఉన్నారు.
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 18:14:19
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
