భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంటలే శాశ్వత పరిష్కారం

జలసిరి ఫామ్ పాండ్ల్ లు , వ్యక్తిగత సోక్ పిట్లపై అవగాహన 

భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంటలే శాశ్వత పరిష్కారం

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం, తగ్గుతున్న వర్షపాతం నేపథ్యంలో రైతులకు భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రతి రైతు పొలంలో ఇంకుడు గుంటలు, బోర్‌వెల్ రీచార్జ్, జలసిరి, ఫామ్‌పాండ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి మట్టం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. నీటి సంరక్షణ చర్యలతో సాగునీటి సమస్య తగ్గి రైతులకు మెరుగైన దిగుబడులు, అధిక ఆదాయం లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతా రమేష్, పంచాయతీ కార్యదర్శి పావని, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
శివంపేట( మెదక్): స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరంతో పాటు విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ కో-ఆప్షన్ సభ్యులు...
విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.
అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?