​మల్యాల :కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం అధికారులను ఆదేశించారు. ​ బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎమ్మెల్యే గిరి ప్రదక్షిణ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ. వర్షాకాలం దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారిపై అవసరమైన చోట తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రదక్షిణ మార్గంలో తగినన్ని తాగునీటి వసతులు కల్పించాలని అధికారులకు, స్థానిక నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంజన్న సేవలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.