కాలనీ అభివృద్ధిలో నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఉంటుంది
బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
మేడ్చల్ మల్కాజ్గిరి : కుత్బుల్లాపూర్ డివిజన్ ఇంద్ర సింగ్ నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ, కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులకు నా శుభా కాంక్షలు. కాలనీ అభివృద్ధిలో నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు మన్నే వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రాజేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శివ కుమార్ యాదవ్, కోశాధికారి పి.వెంకటేష్, సీనియర్ సిటిజన్స్ సభ్యులు మన్నే సత్తయ్య, గోపాల్ గౌడ్, సంపత్, ప్రభుదాస్, కాలనీ వాసులు పద్మా, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


